• మరణమ ? మాతృభూమ ? (homeland / Dearth)

    బంగ్లాదేశ్‌లో ఏదైనా మతం మీద దాడి జరిగితే మనం ఇక్కడ సోషల్ మీడియాలో స్టేటస్‌లు పెడతాం. గాజాలో యుద్ధం జరుగుతుంటే మన దేశంలో ప్రదర్శనలు కూడా చేస్తాం. అక్కడ వాళ్లు కూడా మనలాగే మనుషులే అని గట్టిగా చెప్తాం. నిస్వార్థంగా తోటి ప్రజలను ప్రేమించటం చాలా గొప్ప విషయం అని ఉపన్యాసాలు కూడా ఇస్తాం. కానీ “నిస్వార్థంగా సహాయం చేయడం” అంటే ఏంటో ఈ మధ్య ఒక మనిషి గురించి కొన్ని పాడ్‌కాస్ట్‌లు విని, ఆసక్తి పెరిగి, కొన్ని పుస్తకాలు, ఆన్‌లైన్ ఆర్టికల్స్ చదివాక అర్థమైంది. అప్పటిదాకా మనకు తెలిసింది ఏంటంటే, “పబ్లిక్‌లో మంచిగా మాట్లాడటం” — అంతే.

    ఎక్కడో అర్జెంటీనాలోని రోసారియోలో పుట్టి, తనది కాని గ్వాటెమాలాలోని కాపిటలిస్టిక్ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడి, అక్కడి నుంచి మెక్సికోలో కాస్ట్రో సోదరులను కలిసి, క్యూబా నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోసి, కాంగో, బొలీవియా ప్రభుత్వాలకు ఎదురు నిలిచి, చివరికి సైన్యం చేతిలో హత్యకు గురైన వ్యక్తి — చే గువేరా. కానీ 60 ఏళ్ల తరువాత కూడా, రష్యా నుంచి కేరళ దాకా “విప్లవం” అంటే గుర్తుకువచ్చే పేరు, మర్చిపోలేని ముఖం — ఎర్నెస్టో గువేరా డి లా సెర్నా. పేరు కూడా కాస్త పెద్దదే, ఆయన చేసిన పని కూడా పెద్దదే, లేకపోతే ఇంత పాప్యులారిటీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి?అతని అసలు పేరులో “చే” లేదు. క్యూబా సాయుధ పోరాట సమయంలో అందరినీ “చే” అని పదే పదే పిలిచేవాడు. “చే” అనేది అర్జెంటీనాలో వాడే కామన్ స్లాంగ్. అది “అయ్యా,” “స్నేహితుడా,” లేదా “హే” లాంటి అర్థాల్లో వాడతారు. కానీ క్యూబాలో ఈ మాట అంత సాధారణం కాదు. అందుకే అతను ప్రతి రెండు మాటలకు ఒకసారి “చే” అంటున్నాడని చూసి, అతని సహచరులు సరదాగా “చే” అని పిలవడం మొదలుపెట్టారు. అలా అది అతనికి అతుక్కుపోయింది. మన దగ్గర ఎవడైనా ఒక మాట ఎక్కువగా వాడితే నిక్ నేమ్ పడుతుంది కదా, చే కి కూడా అదే జరిగింది. ప్రపంచానికి మాత్రం అది ‘చే గువేరా’ అయ్యింది.

    చేకు జీవితాంతం తీవ్రమైన ఆస్తమా ఉన్నా, క్రీడల్లో మాత్రం చాలా చురుకుగా ఉండేవాడు. ఈత, ఫుట్‌బాల్, గోల్ఫ్, షూటింగ్ ఇవన్నీ ఇష్టమే. ఇంకా శక్తివంతమైన సైక్లిస్ట్ కూడా. రగ్బీ అంటే మరీ ప్రాణం. అంటే ఒకవైపు ఊపిరి సరిగ్గా ఆడదు, ఇంకోవైపు శరీరం మాత్రం “నాకేం తక్కువ?” అన్నట్టు ఉండేది. చిన్నప్పుడు అమ్మమ్మ క్యాన్సర్‌తో చనిపోవడంతో, “నేను డాక్టర్ అయితే ఇలాంటివాళ్లను చనిపోకుండా కాపాడాలి” అనే ఆలోచనతో యూనివర్సిటీ ఆఫ్ బ్యూనస్ ఐరీస్‌లో మెడిసిన్ చేరాడు. కొందరు చదువు కోసం వెళ్తారు, చే మాత్రం జీవితాన్ని అర్థం చేసుకోవడానికి వెళ్లాడు.ఆ సమయంలో చే రెండు మోటార్‌సైకిల్ యాత్రలు చేశాడు. మొదటిది 1950లో ఒంటరిగా.. సుమారు 4,500 కిలోమీటర్లు ఉత్తర అర్జెంటీనా అంతా తిరిగాడు. రెండవది 1952లో స్నేహితుడు అల్బెర్టో గ్రానాడోతో కలిసి, 9 నెలల పాటు 8,000 కిలోమీటర్లు అర్జెంటీనా, చిలీ, పెరూ, కొలంబియా, వెనిజులాలో ప్రయాణించారు. ఈ యాత్రలో చే రాసిన డైరీ 43 ఏళ్ల తర్వాత ‘The Motorcycle Diaries’ పేరుతో పుస్తక రూపంలో వచ్చింది. అది 30కి పైగా భాషల్లోకి అనువదించబడింది. ఈ యాత్రలోనే ఆయన దోపిడీకి గురైన గని కార్మికులు, హింసకు గురైన కమ్యూనిస్టులు, సమాజం దూరం పెట్టిన కుష్ఠురోగుల పరిస్థితిని చూసి చలించిపోయాడు. అప్పటి వరకు “ప్రపంచం ఇలా ఉంది” అనుకున్నవాడు, తర్వాత “దీనిని ఇలాగే వదిలేయాలా?” అని ఆలోచించడం మొదలుపెట్టాడు.

    అర్జెంటీనా తిరిగి వచ్చి చదువు పూర్తిచేసిన చే, గ్వాటెమాలాలో కాపిటలిస్టిక్ వ్యవస్థకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాల్గొన్నాడు. అక్కడ హిల్డా గాడియా అకోస్టా అనే ఆర్థిక శాస్త్రవేత్తను కలిశాడు. తరువాత వాళ్లు పెళ్లి చేసుకున్నారు. వారికి కలిగిన పెద్ద కూతురే హిల్డిటా గువేరా. జీవితంలో ఒక దశలో ప్రేమ, కుటుంబం, పోరాటం — అన్నీ కలిసి నడిచాయి. కానీ చే మనసు మాత్రం “ఇంకా ఏదో చేయాలి” అనే తపనతోనే ఉండేది.గ్వాటెమాలా నుంచి చే మెక్సికో వెళ్లి, అక్కడ ఒక పాత స్నేహితుడి ద్వారా క్యూబాలో బాటిస్టా మీద సాయుధ పోరాటం చేస్తున్న అన్నదమ్ములు ఫిడెల్ క్యాస్ట్రో, రౌల్ క్యాస్ట్రోలను కలిశాడు. ఆ తర్వాత మూడు సంవత్సరాలు ఊహకందని పోరాటం చేసి, క్యూబాను నియంత పాలన నుంచి విముక్తం చేశాడు. తరువాత మంత్రి‌గా, జాతీయ బ్యాంకు అధ్యక్షుడిగా పని చేశాడు.

    ఐదేళ్లలోనే ఒక సాధారణ క్యాడర్ నుంచి క్యూబాలో నెంబర్ 2 స్థాయికి చేరాడు. మనకు ఇంత సాధిస్తే “ఇక చాలు” అనిపిస్తుంది. కానీ చే కి మాత్రం “ఇంకా ఎవరికైనా ఉపయోగపడాలి” అనే తపన ఉండేది.అందుకే, ఫిడెల్ క్యాస్ట్రోకి చెప్పి, కనీసం భార్య పిల్లలకు కూడా చెప్పకుండా చే కాంగో, బొలీవియా పోరాటాల కోసం వెళ్లిపోయాడు. కాంగోకి వెళ్లే సమయానికి అతని చివరి కొడుకు 2–3 నెలల పసివాడు. ఐదుగురు పిల్లల్లో మొదటి ఇద్దరికి తప్ప మిగతావాళ్లకు తమ నాన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు. కేవలం ఫోటోల్లో చూసి గుర్తుపట్టాల్సిన స్థితి.కాంగో, బొలీవియాలో మాత్రం ఘోర పరాజయం ఎదురైంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రధాన కారణం — స్థిరమైన నాయకత్వం లేకపోవడం. క్యూబా పోరాటం గెలవడానికి చే ఎంత కష్టపడ్డాడో, క్యాస్ట్రో కూడా అంతే అండగా ఉన్నాడు. ఆ స్థాయి నాయకత్వం ఇక్కడ దొరకలేదు. పైగా స్వార్థపూరిత స్థానిక నాయకత్వం, అహం — ఇవన్నీ కలిసి పోరాటాన్ని దెబ్బ తీశాయి. చివరికి చే బొలీవియాలో, అమెరికా CIA సహకారంతో సైన్యం చేతిలో హత్యకు గురయ్యాడు.చే బృందం పట్టుబడినప్పుడు అతని చేతులు వెనక్కి కట్టి, తొమ్మిది సార్లు కాల్చారు. కాల్చే ముందు కూడా అతన్ని తీవ్రంగా వేధించారు. అతని మృతదేహాన్ని హెలికాప్టర్ ల్యాండింగ్ స్కిడ్‌కు వేలాడదీసి, వల్లెగ్రాండే నగరానికి తీసుకెళ్లారు. 39 ఏళ్ల చిన్న జీవితంలో ఇంతటి ప్రస్థానాన్ని చూసిన చే, 60 ఏళ్ల తర్వాత కూడా ఒక తరానికి ఐకాన్‌గా నిలిచిపోయాడు. మనుషులు చనిపోతారు, కానీ కొన్ని పేర్లు మాత్రం గోదావరి వరదలా ప్రవహిస్తూనే ఉంటాయి.

    మా మహేష్ అన్న “పులి నుంచి 3 నేర్చుకోవాలి” అన్నాడు. నేను చే నుంచి కూడా 3 నేర్చుకున్నా.ఉత్తరాలు రాయటం: తన అమ్మ, నాన్న, కూతురు హిల్డిటా (Hildita), అలీయుడ గువేరా (Aleida Guevara), భార్య అలీయుడ మార్చ్ (Aleida March)కి రాసిన ఉత్తరాలు తరువాతి కాలంలో ఎన్నో పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి.డైరీ రాయటం: మోటార్‌సైకిల్ మీద యాత్ర చేసిన రోజు నుంచి క్యూబా (Cuba), కాంగో (Congo), బొలీవియా (Bolivia)లో ప్రతి రోజూ, చివరికి చనిపోయే ముందు రోజు కూడా డైరీ రాసుకున్నాడు. మనం మాత్రం మూడు రోజులు diary రాస్తే నాలుగో రోజు “ఏదో పని ఉంది” అంటాం.నిస్వార్థంగా సహాయం చేయటం: Help selflessly.

    మా కులం, మా భాష, మా ప్రాంతం అని విడిపోతున్న ఈ రోజుల్లో, ఏ సంబంధం లేకపోయినా ప్రాణాలు ఇచ్చిన హీరో చే. ఇది మాటల్లో కాదు, జీవితంతో చూపించాడు.ఇక మీదట ఎప్పుడైనా షర్ట్ మీద, బైక్ మీద, లేదా సినిమాల్లో చే గువేరా ఫోటో కనిపిస్తే, “ఓయ్, మనోడు వచ్చేశాడ్రా” అనిపిస్తుంది. నన్ను ఇంతగా ప్రేరేపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఎలా ఉంటా?? 

    ***

    If any religion is attacked in Bangladesh, we put up statuses on social media here. If there’s a war happening in Gaza, we even hold protests in our country. We loudly say, “They’re humans just like us.” We give speeches about how noble it is to love fellow human beings selflessly.

    But what “selfless help” actually means… I only understood recently after listening to a few podcasts about one man, getting curious, and then reading some books and online articles. Until then, all we really knew was “speaking nicely in public” — that’s it.

    Born somewhere in Rosario, Argentina… fought against the capitalist system in Guatemala, a country that wasn’t even his own… then went to Mexico and met the Castro brothers… helped overthrow Cuba’s dictatorship… later fought against governments in Congo and Bolivia… and was eventually killed by the military — that man was Che Guevara.

    But even 60 years later, from Russia to Kerala, the name that instantly comes to mind when someone says “revolution,” the face people can never forget — Ernesto Guevara de la Serna. Even his name is long… and the work he did was equally massive. Otherwise where does this level of popularity come from?

    Actually, “Che” wasn’t part of his original name. During the Cuban armed struggle, he constantly called everyone “Che.” In Argentina, “Che” is a common slang word — something like “hey,” “brother,” or “mate.” But in Cuba, it wasn’t used that much. So his comrades noticed that he was saying “Che” every two sentences and jokingly started calling him that. It stuck to him permanently.

    Just like how someone here gets a nickname because they overuse one word… same thing happened to Che. The world, however, turned it into “Che Guevara.”

    Che suffered from severe asthma throughout his life, but in sports he was unbelievably active. Swimming, football, golf, shooting — he loved all of them. He was also a powerful cyclist. But rugby? That was his true obsession.

    So on one side, his lungs were like, “Brother, please relax,” while on the other side, his body was like, “What exactly is my problem?”

    When he was young, his grandmother died of cancer. That made him think, “If I become a doctor, maybe I can stop people like her from dying.” With that thought, he joined the University of Buenos Aires to study medicine.

    Most people go to college for a degree. Che went there to understand life itself.

    During that period, Che went on two motorcycle journeys. The first was in 1950, alone — he travelled nearly 4,500 kilometers across northern Argentina. The second was in 1952 with his friend Alberto Granado. For 9 months, they travelled over 8,000 kilometers across Argentina, Chile, Peru, Colombia, and Venezuela.

    The diary Che wrote during this trip was published 43 years later as The Motorcycle Diaries. It was translated into more than 30 languages.

    During that journey, he saw exploited mine workers, persecuted communists, and leprosy patients abandoned by society. Until then, he had simply thought, “This is how the world is.” After that, he began asking, “Should we really leave it this way?”

    After returning to Argentina and finishing his studies, Che joined the struggle against the capitalist system in Guatemala. There he met economist Hilda Gadea Acosta. Later they got married. Their eldest daughter was Hildita Guevara.

    At one point in life, love, family, and revolution all travelled together. But Che’s mind still burned with one thought: “I need to do more.”

    From Guatemala, Che went to Mexico, where through an old friend he met Fidel Castro and Raúl Castro, the brothers leading the armed struggle against Batista in Cuba.

    After that, they fought for three unimaginable years and liberated Cuba from dictatorship. Later, Che worked as a minister and even became president of the national bank. Within five years, he rose from being an ordinary cadre to effectively the No. 2 figure in Cuba.

    For most of us, achieving that much would make us say, “Alright boss, life settled.”

    But Che still felt, “I should be useful to someone else too.”

    So he informed Fidel Castro and quietly left for the struggles in Congo and Bolivia — without even properly telling his wife and children. By the time he left for Congo, his youngest son was just 2–3 months old. Among his five children, only the first two even knew what their father looked like. The others had to recognize him from photographs.

    In Congo and Bolivia, however, he faced crushing defeat. There were many reasons. The biggest one was the lack of stable leadership.

    Che struggled immensely to win the Cuban revolution, yes — but Fidel Castro stood beside him with equal strength. That kind of leadership didn’t exist here. Add selfish local leadership and ego clashes to the mix, and the movement collapsed.

    Eventually, in Bolivia, Che was captured and killed by the military with assistance from the CIA.

    When Che’s group was caught, his hands were tied behind his back and he was shot nine times. Before shooting him, they tortured him brutally. His body was then hung from a helicopter landing skid and taken to the town of Vallegrande.

    In just 39 years of life, Che lived through an extraordinary journey. Even after 60 years, he remains an icon for generations. People die… but some names flow forever like the floods of the Godavari.

    Our Mahesh anna once said, “There are three things to learn from a tiger.”

    I feel there are three things to learn from Che too.

    1. Writing letters
    The letters he wrote to his parents, his daughter Hildita, Aleida Guevara, and his wife Aleida March were later published as books.

    2. Writing diaries
    From the day he started his motorcycle journey until his very last day before death — in Cuba, Congo, and Bolivia — he wrote a diary every single day.

    Meanwhile, we write in a diary for three days and on the fourth day we’re like, “Busy ra, too much work.”

    3. Helping selflessly
    Help selflessly.

    At a time when people divide themselves over caste, language, and region, Che gave his life for people completely unrelated to him. He didn’t just preach it — he lived it.

    From now on, whenever I see Che Guevara’s face on a shirt, bike, or in a movie, I’ll probably feel like, “Oye… our guy is here again.”

    How can I not thank the man who inspired me this much?

  • విక్టోరియా పబ్లిక్ హాల్

    Europe బయట మొట్టమొదటి సినిమా ఎక్కడ ప్రదర్శించారో తెలుసా? ఒకే ఒక్క భవనం.. అటు క్రీడలకు, ఇటు కళలకు, మరోవైపు ఆధునిక రాజకీయాలకు పురిటిగడ్డగా నిలిచిందంటే నమ్ముతారా? అదే చెన్నైలోని చారిత్రక విక్టోరియా పబ్లిక్ హాల్. ఇది కేవలం ఇటుకలు, ఇసుకతో కట్టిన కట్టడం కాదు.. 150 ఏళ్ల మద్రాసు జ్ఞాపకాలను తన గుండెల్లో దాచుకున్న ఒక సజీవ సాక్ష్యం.

    యూరప్ వెలుపల మొట్టమొదటి సినిమా ప్రదర్శనలు జరిగిన అరుదైన వేదికలలో ఇది ఒకటి. మద్రాసు వాసులు తొలిసారి ‘కదిలే బొమ్మలను’ చూసి ఆశ్చర్యపోయింది ఇక్కడే! నేడు మనం చూస్తున్న టెన్నిస్, బాక్సింగ్ వంటి ఎన్నో క్రీడల అసోసియేషన్లు ఇక్కడే ఓనమాలు దిద్దుకున్నాయి. తమిళనాడు రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన ‘జస్టిస్ పార్టీ’ (Justice Party) ఆవిర్భవించింది కూడా ఈ చారిత్రక హాల్‌లోనే.

    1870ల కాలంలో మద్రాసులో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించుకోవడానికి ఒక సరైన ‘టౌన్ హాల్’ లేని లోటు స్పష్టంగా కనిపించేది. అయితే, దీని కోసం ప్రభుత్వం వైపు చూడకుండా, నగర ప్రముఖులంతా స్వయంగా నడుం బిగించారు. ఆ సమయంలో విజయనగరం జమీందారు పూసపాటి ఆనంద గజపతి రాజు గారు స్పందించి, ఏకంగా ₹10,000 భారీ విరాళాన్ని ప్రకటించి ఈ సంకల్పానికి ఊపిరి పోశారు. ఆయన స్ఫూర్తితో ట్రావంకోర్, మైసూరు, రామనాడు మరియు పుదుకోట్టై మహారాజులు కూడా తమ వంతు సాయం అందించారు. అలా అందరూ కలిసి సమీకరించిన ₹18,000 విరాళాలతోనే ఈ అద్భుత కట్టడం రూపుదిద్దుకుంది.

    ఈ చారిత్రక భవనాన్ని ప్రఖ్యాత బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ ఫెలోస్ చిషోల్మ్ (Robert Fellowes Chisholm) తీర్చిదిద్దారు. ముఘల్, ఇస్లామిక్ మరియు యూరోపియన్ నిర్మాణ శైలుల అపూర్వ కలయిక అయిన ‘ఇండో-సార్సెనిక్’ (Indo-Saracenic) పద్ధతిలో దీనిని డిజైన్ చేశారు. చిషోల్మ్ కేవలం దీనికే కాదు.. ఊటీలోని నీలగిరి లైబ్రరీ, తిరువనంతపురంలోని నేపియర్ మ్యూజియం, మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ మరియు మద్రాస్ యూనివర్సిటీ సెనేట్ బిల్డింగ్ వంటి మరెన్నో అపురూప కట్టడాలకు ప్రాణం పోసిన మేధావి. కేరళ శైలిని తలపించే భారీ గవాక్షాలు (Windows), రాజసాన్ని ఒలికించే ఎర్ర ఇటుకల నిర్మాణం మరియు పైభాగంలో మెరిసే బంగాళా పెంకులు ఈ హాల్‌కు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి.

    ​ఈ వేదిక కేవలం ప్రసంగాలకు పరిమితం కాలేదు; చరిత్రను సృష్టించిన మహనీయుల గళం ఇక్కడ ప్రతిధ్వనించింది. మహాత్మా గాంధీ నుంచి స్వామి వివేకానంద వరకు ఎందరో ప్రపంచ స్థాయి నాయకులు ఈ హాల్ నుండే ప్రజలను ఉత్తేజపరిచారు. ​కళలు మరియు క్రీడల పరంగా కూడా ఈ భవనం ఒక విప్లవానికి వేదికైంది. తమిళనాడు బాక్సింగ్ అసోసియేషన్, కబడ్డీ అసోసియేషన్ మరియు ఖో-ఖో అసోసియేషన్ వంటి ఎన్నో క్రీడా సంస్థలు ఇక్కడే ఓనమాలు దిద్దుకున్నాయి. 1891లో స్థాపించబడిన ‘సుగుణ విలాస సభ’ తమిళ నాటక రంగ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఆనాటి కళాకారులకు ఇది ఒక దేవాలయంగా విరాజిల్లింది.

    1896లో మద్రాస్ ఫోటోగ్రాఫిక్ స్టోర్ యజమాని టి. స్టీవెన్సన్ ఆధ్వర్యంలో నగరంలోనే మొట్టమొదటి సినిమాటోగ్రాఫ్ ప్రదర్శన ఇక్కడ జరిగింది. ‘మ్యాజిక్ లాంతర్’ స్లైడ్లు, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వెండితెరపై కదిలే బొమ్మలను చూసి మద్రాసు ప్రజలు అప్పట్లో సంభ్రమంతో మునిగిపోయారు. ఇది చెన్నైలో సినిమా యుగానికి నాంది పలికిన చారిత్రక ఘట్టం.

    ​కళలతో పాటు, బ్రిటిష్ సైనికుల విందులు (Banquets), డ్యాన్స్ ప్రోగ్రామ్స్ (Regimental Balls) ఇక్కడ తరచుగా జరుగుతుండేవి. అయితే, 1916లో తమిళ రాజకీయాలను సమూలంగా మార్చేసిన ‘జస్టిస్ పార్టీ’ ఇక్కడే ఉద్భవించడం ఈ భవన చరిత్రలో ఒక మైలురాయి. కాలం గడిచేకొద్దీ నగరం విస్తరించడం, కోడంబాక్కం మరియు వడపళని వంటి ప్రాంతాలు సినిమా హబ్‌లుగా మారడంతో విక్టోరియా హాల్ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆధునిక భవనాలు రావడంతో ఈ చారిత్రక హాల్ తన పూర్వ వైభవాన్ని కొంత కోల్పోయింది.

    విక్టోరియా పబ్లిక్ హాల్ కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ, దానిని కాపాడుకోవాలనే ప్రయత్నాలు ఆగలేదు. 1967 మరియు 1990లలో కొన్ని మరమ్మత్తులు జరిగినప్పటికీ, అవి భవనానికి పూర్తి స్థాయి పూర్వ వైభవాన్ని తీసుకురాలేకపోయాయి. ప్రధాన నిర్మాణ సమస్యలు అలాగే ఉండిపోయాయి.

    అయితే, ఈ వారసత్వ కట్టడాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం అడుగులు వేసింది. 2009లో ఎం.కే. స్టాలిన్ గారు చెన్నై మేయర్‌గా ఉన్న సమయంలో, జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ కింద ₹3.96 కోట్లతో పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. చివరకు 2021లో Singara Chennai 2.0′ పథకం ఈ భవనానికి కొత్త జీవం పోసింది. సుమారు ₹32 కోట్ల భారీ బడ్జెట్‌తో సమగ్ర పునరుద్ధరణ పనులు జరిగాయి. సవాని హెరిటేజ్ కన్జర్వేషన్’ (Savani Heritage Conservation Pvt. Ltd.) సంస్థ ఆధ్వర్యంలో, భవన అసలు శైలి దెబ్బతినకుండా అత్యంత జాగ్రత్తగా ఈ పనులను నిర్వహించారు.

    ప్రస్తుతం విక్టోరియా పబ్లిక్ హాల్ కేవలం ఒక చారిత్రక కట్టడంగానే కాకుండా, ఒక అద్భుతమైన మ్యూజియంగా, సాంస్కృతిక వేదికగా తన రెండో ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆధునిక కాలంలో మనం వేల కోట్లతో కొత్త నగరాలను, హైటెక్ భవనాలను నిర్మిస్తున్నాం. కానీ, 150 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఇలాంటి వారసత్వ సంపదను కాపాడుకోవడం అనేది నిజంగా గర్వించదగ్గ మరియు ప్రశంసనీయమైన విషయం.

    పునర్వికాసం అంటే కేవలం ఆకాశహర్మ్యాలను నిర్మించడం మాత్రమే కాదు, మన మూలాలను గౌరవించడం. మన పూర్వీకులు అందించిన కళాత్మక సంపదను పునరుద్ధరించి, పదిలపరచి రాబోయే తరాలకు సజీవంగా అందించడమే అసలైన పునర్నిర్మాణం. మన చరిత్రను సంరక్షించుకోవడం మన అందరి కనీస బాధ్యత.

    మన చుట్టూ ఉన్న ఇలాంటి చారిత్రక భవనాలను సందర్శించడం, వాటి గురించి తెలుసుకోవడం వల్ల మన సంస్కృతిపై మనకు గౌరవం పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా విక్టోరియా పబ్లిక్ హాల్‌ను చూశారా? మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్‌లో పంచుకోండి !!

    మా photographic society of Madras తో కలిసి మేము తీసిన కొన్ని ఛాయాచిత్రాలు ఈ క్రింద ఉన్న QR ని scan చేసి చూడచ్చు.

  • కాశి – చివరి భాగం
    కాశీలో మేము

    ఈసారి మేము కాశీలో  6 రోజులు ఉన్నాం. కాశీ లో ఉండటానికి 400 రూపాయల నుంచి 40,000 దాక రూములు దొరుకుతాయి. సోనార్పురా వెళ్తే ఎదో రాజమండ్రి వెళ్లినట్టు ఉంటుంది. తెలుగు జనాలు, తెలుగు హోటలు, తెలుగు భోజనం,  బోర్డులు కూడా తెలుగులో ఉంటాయి. 1500 కి మంచి గది అద్దెకు దొరుకుతుంది. గంగ వడ్డున 2500-3000 ఉంటాయి గదిలోంచి గంగ కనపడేలా వ్యవస్ధ ఉంటుంది. సోనార్పురా ఒంటరిగా ప్రయాణం చేయాలి అనుకునే అమ్మాయిలకి కూడా  సురక్షిత స్థలం.

    దేవాలయాలు

    కాశీ అనగానే మనకి గుర్తువచ్చేది విశ్వనాథ దేవాలయం. తెల్లవారుఝమున 3 గంటలకి అభిషేకం చేసుకోవచ్చు. కచ్చితంగా టిక్కెట్లు 1 నెల ముందు ఆన్లైన్లో  తీసుకోవాలి. 2 గంటలకి లైనులో గేట్ 4 నుంచి వెళ్ళాలి. లైన్లో ముందు ఉంటే అభిషేకం, అలంకారం దగ్గర నుంచి చూడొచ్చు లేదా టికెట్ ఉన్నా కానీ గర్భగుడి బైట టీవీ లోనే చూడాలి. గర్భగుడి చాలా ఇరుకు,  అందువల్ల చాలా చాలా తక్కువమందికి నేరుగా చూసే అవకాశం ఉంటుంది. 3-4 టికెట్ ఉన్న వాళ్ళకి అభిషేకం. తరువాత 4-5 టికెట్ లేని వాళ్ళకి. ఐతే ఈ లైన్ లో కాశీ లో నివసిస్తున్న వాళ్ళకి విడిగా క్యూలైన్ ఉంటుంది (aadhar card తప్పనిసరి). అందువలన ఈ లైన్లో తొక్కిసలాట ఎక్కువ. సాధ్యం అయినంతవరకు ఈ దర్శనం avoid చేయటం మంచిది. 5 తరువాత రాత్రి వరకు సర్వ దర్శనం మరియు  300 రూపాయల శీఘ్ర దర్శనం. ఐతే ఇవి ఏవి గర్భగుడిలోకి అనుమతించబడవు. 300 రూపాయల టికెట్ డైరెక్టుగా కూడా దొరుకుతుంది (పండగ రోజులలో online లో reserve చేసుకోవటం మంచిది)

    కాలభైరవ ఆలయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది, ఉదయం 5-7 మధ్యలో వెళ్ళటం మంచిది. విశాలాక్షిని, అన్నపూర్ణనీ చూడటం తేలికే. రద్దీ ఉన్నా దర్శనం త్వరగా అయిపోతుంది. అన్నపూర్ణ క్షేతం లో  ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు అన్నదానం జరుగుతూ ఉంటుంది. అన్నదానానికి విరాళాలు ఇచ్చిన దాతలలో మన తెలుగువాళ్లు సింహభాగంలో ఉండటం చాల గర్వంగా అనిపించింది. తులసి మానస్ మందిరం లో తులసీదాసుగారు రామచరితమానస్ రచించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో కాశీ విశ్వనాథమందిరం సాయంత్రాలు ప్రశాంతతనిస్తాయి. సంకట మోచన్ హనుమాన్ దేవాలయం   16వ శతాబ్దంలో తులసీదాస్ ద్వారా ప్రారంభించబడ్డాయి.


    కాశీ చాలా అపరిశుభ్రం గా ఉంటుంది, రోడ్లు రద్దీగా, ఇరుకుగా ఉంటాయి, ఎండాకాలం సూర్యుడు కాశీలో ఉంటాడా అన్నట్టు ఉంటుంది, చలికాలం మధ్యాహ్నం 1 ఐనా సూర్యుడు కనపడదు , కాశీలో కనీసం రోజుకి  8-10 km నడవాలి (డబ్బులు ఉంటె రోజుకి 800-1000 ఆటోలకి ఖర్చు చేయచ్చు), బేరం ఆడటం బాగా రావాలి, ఎప్పుడు 50-100 చిల్లర పెట్టుకోవాలి, పడవ నడిపే MS narayana  500 అడుగుతాడు , 150 కి మించి ఇవ్వకూడదు. Cab తోలే సుబ్రహ్మణ్యం విమానాశ్రయం కి 1200 అడుగుతాడు., 600-700 కి మించాల్సిన పని లేదు.  పూజ చేయిస్తా, తాయత్తు కడతా, విశ్వనాథుడిని చూపిస్తా అని బ్రహ్మనందం వస్తాడు ఓ, “नहीं चाहिए” అని తిరస్కరించి వెళిపోవటమే.
    వీటికి సిద్ధపడితే కాశీ ఒక మరుపురాని జ్ఞాపకం అవుతుంది.

    అభిలాష్ తీసిన గంగా హారతి ఫొటోలు

    నాకు తెల్సిన ఒక అమెరికాలో ఉండే తెలుగు అమ్మాయి అలంకృత ఈ మధ్యలో కాలంలో కాశీ ప్రయాణించి “మీరు వెళ్ళాలి” అని ప్రభావితం చేసింది. అలానే స్పందన అని తెల్సిన ఫోటోగ్రాఫర్ కాశీలో ఎన్నో అందమైన ఫోటోలు తీసి “అన్న మీరు వెళ్ళండి “అని ఎన్నోసార్లు చెప్పింది. అలంకృత గారికి, స్పందనకి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు. నాలా ఎంతో మందికి కాశీ అన్నా తిరువణ్ణామలై అన్నా ఒక ఆసక్తిని పెంపొందించిన చాగంటి వారికీ ఈ తరం చాలా రుణపడి ఉంటుంది .

    ఇంకో కథతో త్వరలో మళ్ళీ కలుస్తా !!!

    శుభం

  • కాశి – రెండవ భాగం
    గంగ

    చాగంటి వారు చెప్పిన సగరుడు, అసమంజసుడు,అంశుమంతుడు, దిలీపుడు ,భగీరథుడు, వాళ్ళ కథలు,  గంగావతరణం వినీ వినీ గంగని కాశీలో చూస్తే భగీరథుడి కష్టం తెలుస్తుంది.

    నాకు 8ఏళ్ళ వయసులో మొదటిసారి గంగని చూసాను – హృషీకేశ్ లో. తరువాత చాలా సార్లు చాలా చోట్ల గంగని చూసాను.  బద్రీనాథ్, దేవప్రయాగ, హరిద్వార్ , ప్రయాగ, కాశీ, కలకత్తా. కాశీ గంగ ప్రత్యేకం.

    మిగిలినచోట్ల అందరు గంగలో స్నానం చేసి వెళ్ళిపోతారు. కానీ కాశీలో ప్రతీ ఘాట్ ఒడ్డున ఒక చిన్న ప్రపంచం ఉంటుంది. ఉదయం పూట ఆ ఘాట్ చుట్టుపక్కల వాళ్లు సంధ్యావందనానికి , ఈతకొట్టటానికి, స్నానం చేయటానికి వస్తారు. వాళ్ళ స్నేహితుల్ని కలుసుకుంటారు. 73 ఏళ్ళ ముసలివాళ్ళు ఉంటారు, ఎక్కడో Italy నుంచి కాశీ వచ్చి 23 ఏళ్లుగా ఇక్కడ స్థిరపడిన విదేశీయులు ఉన్నారు, అఖాడాలో కుస్తీ నేర్చుకునేవాళ్ళు ఉంటారు. అందరికి గంగ అమ్మ. గంగని ప్రేమిస్తారు, పూజిస్తారు, తమ జీవితంలో ఒక భాగంగా చూస్తారు.

    మొత్తం 84 ఘాట్లు. హరిశ్చంద్రుడు

    “ఇచ్చోటనే … ఇచ్చోటనే!!! సత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోన కరిగిపోయే.


    ఇచ్చోటనే … భూములేలు రాజన్యుల , అధికార ముద్రికల్ అంతరించే.

    ఇచ్చోటనే..!! లేత ఇల్లాలి నల్లపూసల చౌరు, గంగలో కలసిపోయే.” అని కాటికాపరిగా పనిచేసిన హరిశచెంద్ర ఘాట్,

    బ్రహ్మదేవుడు కాశీకి స్వాగతం చెబుతూ పది అశ్వమేధ యాగాలు చేసిన దశాశ్వమేధ ఘాట్, మరాఠా సింధియా కుటుంబం 19వ శతాబ్దంలో నిర్మించిన సింధియా ఘాట్, తులసీదాస్ రామచరితమానస్ గ్రంథం రచించిన తులసీ ఘాట్, పార్వతి దేవి కర్ణాభరణం పడిన స్థలం మణికర్ణిక ఘాట్. ఇలా ఎన్నో కథలు,

    సాయంత్రం పడవలో అస్సి ఘాట్ నుంచి, మణికర్ణిక వరకు ప్రయాణం చేసి  గేట్ 1 నుంచి దేవాలయం లోకి వెళ్లి విశ్వనాథుడిని, విశాలాక్షిని , అన్నపూర్ణానని చూసి అన్నపూర్ణ దగ్గర అన్నం తిని దశాశ్వమేధ ఘాట్ లో అద్భుతమైన గంగ హారతి చూసి రోజుని పూర్తి చేయచ్చు.

    శీతాకాలం లో పడవ ప్రయాణం ఇంకా బాగుంటుంది. పొగమంచు, Siberian Gull పక్షులు అది ఒక canvas మీద మా జై వేసే పెయింటింగులా ఉంటుంది.

    కాశీ లో మేము గడిపిన రోజులు మా బస, భోజనం, దేవాలయాల విశేషాలు నా తదుపరి blog లో వివరిస్తా.

    శేషం

  • కాశి – మొదటి భాగం

    శ్రీనాథుడు నుంచి సీతారామశాస్ట్రీ వరకు ఎంతో మంది కవులు కాశీని వర్ణించారు. చాగంటివారు ఎన్నో ప్రవచనాలలో కాశీ విశిష్టత,  వైభవం ఎంతో గొప్పగా కళ్ళకు కట్టినట్టు వివరించారు వాళ్ళు అందరూ నాకు ప్రేరణ.

    రమ్య దసరాకి అశ్వారావుపేట వెళ్తా అంటే ఒక వారం నేను ఎటైనా వెళ్దాం అనుకున్నా. కలకత్తా ఇది వరకు వెళ్ళిందే, బొంబాయి చూసిందే, wild life ట్రిప్ కి టిక్కెట్లు లేవు, విహార యాత్రకి ఆసక్తి లేదు.. అప్పుడు అన్నాడు అభిలాష్ “కాశీకి పోదాం రా ” అని. కాశీ విహారయాత్ర కాదు , నాకు అది ఆధ్యాత్మిక యాత్రా కాదు,  చూసినా సరే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే మోక్షధామం.

    కాశీ  అప్పుడు /ఇప్పుడు

    మొదటిసారి నేను అమ్మ నాన్న సీతమ్మ 2011లో కాశీ వెళ్ళాం. అప్పుడు కాశీ అంతా నేను సీతమ్మని చెయ్యి పట్టుకుని నడిపించా. అప్పటికి ఇప్పటికి కాశీ ఎంతో మారింది. యోగి ఆదిత్యనాథ్, నరేంద్రమోడీల చొరవో ఆ విశ్వనాథుని అదృష్టమో ఒక బ్రహ్మాండమైన కట్టడం ఆ దేవాలయం చుట్టూ వెలిసింది. ఇప్పుడు ఇక ఇరుకు సందులు లేవు. అపరిశుభ్రమైన రోడ్లు మాయం. కాశీ విశ్వనాధ్ కారిడార్ ఒక మహత్తరమైన ప్రాజెక్ట్ , 5.5 ఎకరాలలో 350 కోట్లతో కాశీ దేవాలయం రూపురేఖలు మార్చింది . ఉచిత దర్శనానికి విశ్వనాధ్ గల్లీ , 300 రూపాయల దర్శనానికి  ప్రత్యేక టికెట్ దర్శనానికి గేట్ 4, మణికర్ణికా ఘాట్ మరియు గంగా ఘాట్ కి గేట్ 1 అని ఎంతో ప్రాణికతో నిర్మించారు. Toilets, restaurants , పుస్తకాల షాపులు, ప్రసాదం కౌంటర్లు , museums ఇలా ఎన్నో నిర్మించారు.

    కానీ దేవాలయం బైట ఎంతో మంది దర్శనం చేయిస్తాం,  డైరెక్ట్ తీసుకువెళతాం అని వెంటపడుతూ ఉంటారు. మన తిరుపతి, శ్రీశైలం లేక మరి ఏదయినా దేవాలయం లో ఎంతో  వ్యవస్థీకృత వ్యవస్థ ఉండటం వల్ల కాశీలో అంత చాలా అస్తవ్యస్థంగా ఉంటుంది. కాశీ విశ్వనాధ్ కారిడార్ దాటి బైటకి వెళ్తే ఘాట్స్, ఘాట్స్ పక్క రోడ్లు, సోనార్పురా ఇంకా చాలా వెనకపడి ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఆ పరిసరాలు ఎవరు శుభ్రం చెయ్యలేదు.  

    నగర నిగమ్ వారణాసి పనితీరు ఎంతో వెనకపడి ఉంది . వారణాసి కన్నా చిన్న మునిసిపాలిటీలు అయిన తిరుపతి , రాజమండ్రి, ఏలూరు చాలా చాలా శుభ్రంగా ఉంటాయి. అన్ని కోట్లమంది వచ్చే ఊరు , అన్ని కోట్ల ఆదాయం ఉన్న మునిసిపాలిటీ, సాక్షాతూ ప్రధానమంత్రి సొంత నియోజకవర్గం లో పరిశుభ్రత, ట్రాఫిక్ వ్యవస్థ ఒక పెద్ద సున్నా.

    శేషం

  • నేను – మా బాషా

    అవి నేను జిమ్ ని సీరియస్ గా తీసుకుంటున్న రోజులు. మేము ఒక 13 మందిమి కలిసి జిమ్ లో ఒక గ్రూపుగా ఉండేవాళ్ళం. ఒకరోజు ఉదయం అందరం కలిసి  బీచ్ కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక తెలుగు  దోశల బండి దగ్గరకి తీసుకువెళ్లాను . అప్పుడు వచ్చాడు నా దగ్గరకి 13 మందిలో ఒకడు  “అన్నా మీరు తెలుగువాళ్ళా” అంటూ . అవును అన్నా,  అలా పరిచయం అయ్యాడు బాషా !

    అప్పటినుంచి రోజు జిమ్ లో కలిసే వాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం , ఒకరోజు మాటల్లో చెప్పాడు అశోక్ నగర్లో ఒక కేకులు చేసే అమ్మాయి దగ్గర pastry chef గా పనిచేస్తున్నా అని. వాళ్ళది అనంతపురం కానీ ఆ సీమ పౌరుషం ఎప్పుడు కనపడాలా , చాల సౌమ్యంగా, మర్యాదగా మాట్లాడేవాడు. బాషా JNTU అనంతపురం లో బీటెక్  చేసాడు , wipro లో ఉద్యొగం కూడా చేసేవాడు. మనలో చాలా మందికి chef అవ్వాలనో, రైటర్ అవ్వాలనో, ఫోటోగ్రాఫర్  అవ్వాలనో ఆశలు ఉంటాయి.  కానీ ఇంట్లోవాళ్ళు ఒప్పుకోరనో లేదా సమాజాం హర్షించదు అనో  రకరకాల పరిస్థితులు  మనల్ని ఎదో ఒక ఇష్టంలేని ఉద్యోగంలోకి నెట్టేస్తాయి . ఆ సంకెళ్లను లెక్కచేయకుండా బయటికి వచ్చిన వాళ్లలో ఒకడు బాషా. తన లక్ష్యాన్ని సాధించే క్రమంలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగళూరు బస్సు ఎక్కేసాడు . ఆరునెలలు పాటు  ఒక హోటల్లో  ఉల్లిపాయలు కోయటమే పనిగా ఉద్యోగం లో చేరాడు. అందుకే ఏమో బాషా ఉల్లిపాయలు కట్ చేయడంలో ఆస్కార్ లెవెల్ ప్రజ్ఞ సాధించాడు. తరువాత ఒక cult  kitchen లో , ఒక  star హోటల్ లో పని చేసాడు . ఆ రెస్టారెంట్లో ఉద్యోగం తను ఇష్టంగా చేస్తున్నా కూడా ఎక్కడో ఎదో ఒక వెలితి . ఆ వెలితి కి సమాధానం కార్తికా స్రవంతి రూపం లో బాషా కి దొరికింది. తన Bakeman Begins pastry షాప్ లో Pastry చెఫ్ గా జాయిన్ అయ్యాడు.

    2 నెలలకి కోవిడ్, లాక్డౌన్ మొదలు. అందరి జీవితాలు తలక్రిందులు అయిపోయాయి.చిన్న చిన్న వ్యాపారాలు చాలా దెబ్బతిన్నాయి . Cloud  kitchen  అన్న కాన్సెప్ట్  తరువాత రోజుల్లో బాగా ఊపు అందుకున్న మొదట్లో చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయం లోనే ఒక రోజు phone లో బాషా చెప్పాడు , తను పని చేసే Bakeman Begins కూడా తాత్కాలికం గా మూతపడింది అని అలాగే వాళ్ళ hostel కూడా మూసేస్తామని చెప్పేశారని, నేను మా ఊరు వెళ్ళిపోతాను భయ్యా అన్నాడు.  ఎంతో కష్టపడి chennai వచ్చిన బాషా lockdown కారణంగా అనంతపురం వెళ్ళిపోవటం నాకు నచ్చలేదు.  రమ్యతో,  “బాషా అని ఒక కుర్రాడు gym లో పరిచయం హాస్టల్ మూసేస్తున్నారు అంట మన ఇంటికి వచ్చేయమన్నాను అని చెప్పా” రమ్య నన్ను ఒక్క మాట అడగలేదు . ఆ మరుసటి రోజు బాషా మాఇంటికి వచ్చాడు . ఆ తరువాత 3 నెలల్లో బాషా “మా బాషా” అయిపోయాడు.

    కలిసి సినిమాలు చూడటం,  కలిసి వంట చేయటం, అతీలతో ఆడటం , బాషా రమ్య కి ఒక తమ్ముడిలా అక్క అక్క అంటూ కూడా ఉండటం 3 నెలలు ఎలా అయిపోయాయో తెలియదు. Master Chef Australia కొన్ని వందల ఎపిసోడ్లు కలిసి చూసేవాళ్ళం. ఎప్పటికైనా ఆ స్థాయికి  వెళ్లాలి భయ్యా అనే వాడు. మహాభారతం , రామాయణం మీద బాషా కి ఉన్న పరిజ్ఞానం ఆ వయసు లో చాలా తక్కువ మందిలో నేను చూసాను నేను. తరువాత lockdown రూల్స్ సడలించటంతో బాషా Bakeman Begins లో తిరిగి చేరిపోయాడు. కానీ ప్రతిరోజూ కిచెన్ దగ్గరో జిమ్ లోనో ఏదయినా సినిమా వస్తే సినిమాహాల్లోనో కలుస్తూ ఉండే వాళ్ళం.

    బాషా ఏరోజు ఎవరిని ఒక్క మాట అనటం నేను చూడలేదు అంత సహనం ఎలా సాధ్యమో అసలు ఒక మనిషికి . పరిస్థితులు నచ్చకపోతే సర్దుకుపోయే వాడు తప్ప గొడవకు దిగడు . 3 సంవత్సరాలలో బాషా కొన్ని అద్భుతమైన కేక్ లు నాకు రుచి చూపించాడు. తన కిచెన్ లో ఏది కొత్తగా చేసినా “భయ్యా ఒకసారి కిచెన్ కి వస్తావా” అని అడిగే వాడు. నా మీద ప్రేమకాదు . వాళ్ళ అక్కకి (రమ్య కి )ఇవ్వమని ఎదో ఒకటి ఇచ్చి పంపేవాడు నాతో.

    2020 రంజాన్ ఉపవాసం మా ఇంట్లో ఉండి , నమాజ్ మా ఇంట్లో చేసుకుని, ఇఫ్తార్ అతీల వాళ్ళ ఇంట్లో చేసేవాడు . ఆ జ్ఞాపకాలు ఇప్పటికి ఆ గదిలో అలానే ఉన్నాయ్ . బాషా చేతి బిర్యానీ తిన్నాక ఇంక జీవితం లో ఇంకో బిర్యానీ ముట్టుకోరు . నా car కొన్నప్పుడు మొదటి డ్రైవ్ బాషాతోనే. ఎన్నో అద్భుతమైన సినిమాలు మేమిద్దరం కలిసి చూసాం.  పార్థు పుట్టినప్పుడు బారసాలకి ఎక్కడో అశ్వారావుపేట వచ్చి బారసాల జరుగుతున్నంత సేపు గుడిలో కూర్చుని, పార్ధుని అలా భుజాన వేసుకుని తిప్పాడు. తిరుగు ప్రయాణంలో పులిహోర ప్రసాదం బాక్స్ లో పెట్టుకుని ట్రైన్ ఎక్కి తిని చాలా బాగుంది భయ్యా అని ఇప్పటికీ చెప్తూ ఉంటాడు.

    2023 లో బాషా masterchef కి సెలెక్ట్ అయిన  రోజు చెప్పాను టైటిల్ విన్నర్ నువ్వే అని. మొత్తం షూటింగ్ అయిపోయాక టెలికాస్టి అవ్వకముందు రమ్య చాలాసార్లు అడిగింది ఎవరు గెలిచారు అని , కంపెనీ పాలసీ , విన్నర్ ఎవరో చెప్పకూడదు అనేవాడు. కానీ రోజూ రాత్రి నేను చెప్పే వాడిని భాషనే గెలుస్తాడు అని రమ్య కి. అనుకున్నట్టుగానే బాషా తెలుగు Masterchef టైటిల్ విన్నర్ అయ్యాడు. హైదరాబాద్ అంతటా పబ్లిసిటీ పోస్టర్లు, సందడి, హంగామా, సోషల్ మీడియా OTTs లో Masterchef తెలిసిన వాళ్ళకి బాషా ఒక సంచలనం. పేపర్ కాలమ్స్, ఇంటర్వ్యూలు, ఫేమ్ ఇలా ఎన్ని వచ్చిన బాషా ఆ రోజు దోశ బండి దగ్గర ఎలా ఉన్నాడో ఈరోజుకి అలాగే ఉన్నాడు. ఆ అశోక్ నగర్ గ్రేస్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న టీషాప్ మేము రోజూ కలిసే ప్రదేశం. ఇప్పటికీ ఆ దారిలో వెళ్తే కారు ఒకసారి ఆపి బాషా కోసం చూస్తూ ఉంటా. ఎందుకు అంటె రోజూ టీ ఉన్న … ఆ సాయంత్రపు బాషా కబుర్లు ఎప్పుడు లోటే !!

    మా స్నేహితుడి పెళ్లి కి తుఫానులో నాగేర్కోయిల్ వెళ్తున్నపుడు
    కొడనాడులో
    పార్థు పుట్టినపుడు

    హైదరాబాద్ లో ఉన్నా, పనిలో తీరికలేకుండా ఉన్నప్పటికి కూడా నా సలహా ఏదైనా కావాలి  అంటే ” భయ్యా ఒక సలహా కావాలి అని చాలా వినయంగా అడుగుతాడు”. నా పాటికి నేను ఏదయినా చెప్తే మీతో మాట్లాడితే హాయిగా ఉంటుంది భయ్యా అంటాడు . అది నా గొప్ప కాదు ఏది చెప్పినా పాజిటివ్ గా వినే, తీసుకునే అతని గొప్ప .  ఈ రోజు బాషా నా పక్కన లేడు, నేను instagram లో లేకపోవటం వల్ల బాషా పుట్టినరోజు నాకు గుర్తులేదు ,  2 రోజుల క్రితం అయిపోయింది అని తెలిసి, నేను తెలుగులో  మొదటి బ్లాగ్ కాశీ మీద రాయాలి అని అనుకున్నా కూడా దానికన్నా బాషా మీద అతని పుట్టినరోజు సందర్భంగా రాయాలి అని అనుకుని ఇదిగో ఇలా మొదలుపెట్టేసా.

    పుట్టిన రోజు శుభాకాంక్షలు బాషా భాయ్. ఒక Michelnestar Restaurantని భారతదేశానికి తీసుకురాగలిగే తెలివి, క్రమశిక్షణ , పట్టుదల నీకు ఉన్నాయి. ఆ దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి అని ఆశిస్తూ.

    నీ భయ్యా ❤️❤️❤️

  • The Timeless Charm of Kashi Revealed

    How It All Started

    It began casually.
    When Ramya decided to visit Aswaraopeta for Dussehra, I felt the pull to go somewhere — to wander with my camera again. During a recent trip to Hyderabad, Abhilash mentioned he was also craving a break. We first thought of Kedarnath, but a 45–50-hour journey each way was too long. Rajasthan came up next for a biking trip, but somehow the name “Kashi” surfaced. Abhilash said, “Let’s go to Kashi.”

    A few clicks later, the tickets were booked. I took two days off before Dussehra. What began as an idea soon became an instinctive journey — one that would fill my memory card, and my mind, in equal measure.


    Why Kashi

    There was no specific reason — or maybe Kashi chose us.
    Every time I think of it, I feel calm. It reminds me of my father, of walking to Vishwanath temple holding Seetamma’s hand, and of the stories Chaganti Koteswara Rao garu narrated. For me, Kashi is both a memory and a mystery — the perfect blend for a photographer seeking stories.


    The Changing City

    The Kashi I knew years ago has changed dramatically.
    The temple complex has undergone a massive transformation. The narrow lanes once suffocating around it are now open and bright. The new Kashi Vishwanath corridor feels vast, structured, and almost cinematic — clean lines, defined entries, curated spaces.

    From Gate 4, a lane leads to Manikarnika Ghat. Gate 1 opens to a stunning view of the Ganga — a frame that glows in the golden light of dawn. Though the ghats were flooded during our visit, even standing at the edge felt like looking into eternity.

    This is where you feel how development and devotion can coexist — and through the lens, it’s fascinating. The symmetry of the new temple, the chaos of the crowds, the calm of a priest in prayer — every frame tells the story of transition.


    The City That Hasn’t Changed

    But step beyond the corridor, and the old Kashi returns.
    The lanes of Sonarpura remain untouched — narrow, cluttered, and chaotic. Life spills from every corner — people eating, sleeping, washing, praying, and talking all at once. It’s raw, imperfect, yet visually magnetic.
    As a photographer, you don’t look away. You frame it, not to judge, but to preserve — because this too is Kashi, the part that refuses to change.


    Through My Lens

    Kashi is every photographer’s dream and challenge.
    The ghats give you endless frames — the early light hitting the water, priests performing rituals, women in bright saris offering prayers, the orange glow of diyas merging with the river’s reflection.
    Each moment lasts a second, yet feels eternal.

    At Manikarnika and Harishchandra Ghats, time stands still.
    The smoke, the sacred fire, the silence of acceptance — these are moments that test both your eye and your heart. You photograph with humility, because here, life and death share the same frame.

    Boat rides between ghats are pure gold for photography. From the river, you see Kashi differently — layers of life stacked against time. With a good zoom lens, every ghat becomes a story: a boy jumping into the water, a sadhu meditating, an old man lighting a diya. Stitch them into panoramas, and Kashi becomes one living photograph.

    Inside the temples, cameras rest. Photography is prohibited, but observation isn’t — and sometimes, the frames you don’t shoot stay sharper in your memory than those you do.


    The Human Canvas

    Every person in Kashi feels like part of an ancient portrait —
    The flower sellers near Vishalakshi Temple, the chai vendor at Lakshmi Chai Wale, the priest tying a thread at Kalabhairava, or a woman pouring Ganga water back into the river — each a story of faith and endurance.

    People rarely say no when you ask for a photograph. Most smile, some pose, a few simply nod and continue their prayer. That’s the beauty of Kashi — its people are as much part of the landscape as the river itself.


    The Beauty Beyond the Lens

    Beyond photography, Kashi is chaos wrapped in charm.
    The city traffic is maddening — no rules, no signals, just instinct and noise. Public transport barely exists. You learn to walk, to bargain, to adapt. But every step rewards you with a moment worth framing.

    When you finally reach the ghats, all that frustration dissolves. There are 84 ghats, each with a different rhythm. We spent most of our time at Tulsi Ghat, where mornings are quiet, the water is clean, and the locals swim and pray.


    At Assi Ghat, the evenings bloom with Ganga Aarti — a river of light meeting the river of life.


    The Taste of Kashi

    The camera rests when the plate arrives.
    Kashi feeds the soul and the stomach alike — chaat, samosa, kachori, puri bhaji.
    Ram BhandarSri Satyanarayana, and Deena Chat Bhandar are legends.
    Lakshmi Chai Wale makes the most comforting malai toast you’ll ever taste.

    The streets may be messy, but the flavors are pure — just like the city.


    The Temples

    There are five temples you can’t miss —
    Kashi VishwanathKalabhairavaVishalakshiAnnapoorna, and Sankata Hanuman.
    Each one a different mood, a different frame.

    The 3 AM abhishekam at Vishwanath is surreal — the kind of light and emotion no camera can truly capture.
    Crowds, touts, and chaos aside, once you’re in front of the Shiva Linga, everything else fades.


    Kashi in Retrospect

    After six days, thousands of steps, and hundreds of frames, Kashi still felt endless.
    It’s a place that refuses to be summarized — ancient yet evolving, spiritual yet unfiltered.

    For a photographer, it’s humbling.
    You don’t just shoot Kashi — you surrender to it.


    Photographer’s Notes

    • Plan your frames a day before visiting key ghats.
    • Carry smaller lenses to avoid attention at sensitive spots.
    • Boat rides are best during sunrise and post-sunset blue hour.
    • Always ask before photographing people.
    • Temples strictly prohibit cameras — respect that boundary.
    • Walk slowly — some of the best frames appear when you aren’t looking.

    Closing Thought

    “Kashi isn’t a city you visit.
    It’s a city that visits you — through your lens, through your silence, through your heart.”

    For me, Kashi was not just a destination — it was a dialogue between light and life, between faith and the frame.
    Through my camera, I tried to capture what words can only touch — the rhythm of devotion, the quietness of acceptance, and the raw beauty of this timeless city.

    📸 Explore the complete Kashi 2025 photo series here:

    https://enqnarenphoto.myportfolio.com/kashi