శ్రీనాథుడు నుంచి సీతారామశాస్ట్రీ వరకు ఎంతో మంది కవులు కాశీని వర్ణించారు. చాగంటివారు ఎన్నో ప్రవచనాలలో కాశీ విశిష్టత, వైభవం ఎంతో గొప్పగా కళ్ళకు కట్టినట్టు వివరించారు వాళ్ళు అందరూ నాకు ప్రేరణ.
రమ్య దసరాకి అశ్వారావుపేట వెళ్తా అంటే ఒక వారం నేను ఎటైనా వెళ్దాం అనుకున్నా. కలకత్తా ఇది వరకు వెళ్ళిందే, బొంబాయి చూసిందే, wild life ట్రిప్ కి టిక్కెట్లు లేవు, విహార యాత్రకి ఆసక్తి లేదు.. అప్పుడు అన్నాడు అభిలాష్ “కాశీకి పోదాం రా ” అని. కాశీ విహారయాత్ర కాదు , నాకు అది ఆధ్యాత్మిక యాత్రా కాదు, చూసినా సరే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే మోక్షధామం.

కాశీ అప్పుడు /ఇప్పుడు
మొదటిసారి నేను అమ్మ నాన్న సీతమ్మ 2011లో కాశీ వెళ్ళాం. అప్పుడు కాశీ అంతా నేను సీతమ్మని చెయ్యి పట్టుకుని నడిపించా. అప్పటికి ఇప్పటికి కాశీ ఎంతో మారింది. యోగి ఆదిత్యనాథ్, నరేంద్రమోడీల చొరవో ఆ విశ్వనాథుని అదృష్టమో ఒక బ్రహ్మాండమైన కట్టడం ఆ దేవాలయం చుట్టూ వెలిసింది. ఇప్పుడు ఇక ఇరుకు సందులు లేవు. అపరిశుభ్రమైన రోడ్లు మాయం. కాశీ విశ్వనాధ్ కారిడార్ ఒక మహత్తరమైన ప్రాజెక్ట్ , 5.5 ఎకరాలలో 350 కోట్లతో కాశీ దేవాలయం రూపురేఖలు మార్చింది . ఉచిత దర్శనానికి విశ్వనాధ్ గల్లీ , 300 రూపాయల దర్శనానికి ప్రత్యేక టికెట్ దర్శనానికి గేట్ 4, మణికర్ణికా ఘాట్ మరియు గంగా ఘాట్ కి గేట్ 1 అని ఎంతో ప్రాణికతో నిర్మించారు. Toilets, restaurants , పుస్తకాల షాపులు, ప్రసాదం కౌంటర్లు , museums ఇలా ఎన్నో నిర్మించారు.


కానీ దేవాలయం బైట ఎంతో మంది దర్శనం చేయిస్తాం, డైరెక్ట్ తీసుకువెళతాం అని వెంటపడుతూ ఉంటారు. మన తిరుపతి, శ్రీశైలం లేక మరి ఏదయినా దేవాలయం లో ఎంతో వ్యవస్థీకృత వ్యవస్థ ఉండటం వల్ల కాశీలో అంత చాలా అస్తవ్యస్థంగా ఉంటుంది. కాశీ విశ్వనాధ్ కారిడార్ దాటి బైటకి వెళ్తే ఘాట్స్, ఘాట్స్ పక్క రోడ్లు, సోనార్పురా ఇంకా చాలా వెనకపడి ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఆ పరిసరాలు ఎవరు శుభ్రం చెయ్యలేదు.





నగర నిగమ్ వారణాసి పనితీరు ఎంతో వెనకపడి ఉంది . వారణాసి కన్నా చిన్న మునిసిపాలిటీలు అయిన తిరుపతి , రాజమండ్రి, ఏలూరు చాలా చాలా శుభ్రంగా ఉంటాయి. అన్ని కోట్లమంది వచ్చే ఊరు , అన్ని కోట్ల ఆదాయం ఉన్న మునిసిపాలిటీ, సాక్షాతూ ప్రధానమంత్రి సొంత నియోజకవర్గం లో పరిశుభ్రత, ట్రాఫిక్ వ్యవస్థ ఒక పెద్ద సున్నా.

Leave a reply to Anonymous Cancel reply